
కూతురు పరాయి వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో కన్న తండ్రే ఆమెను కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలోని ఖిరియా థాపక్ గ్రామంలో వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడని అరెస్ట్ చేశారు. ఈఘటనపై స్థానిక ఎస్‌డీఓపీ సంజయ్ కోచా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తన వివాహిత కుమార్తెను కాల్చి చంపాడనే ఆరోపణలు రావడంతో అతన్ని అరెస్ట్ చేశామని.. అలాగే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. థాపక్ గ్రామం మున్నేష్ ధనుక్ అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. అతనికి నిధి దనుక్ అనే 21 ఏళ కుమార్తె ఉంది. ఈమె గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. కానీ ఇందుకు ఒప్పుకొని తల్లిదండ్రులు ఆమెకు గతేడాది డిసెంబర్ 15న గ్వాలియర్‌లోని గుడగుడికా నాకాకు చెందిన దేవ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ ప్రేమికుడిని మర్చిపోలేని యువతి పెళ్లైన 17 రోజులకే అంటే డిసెంబర్ 28న తన ప్రియుడితో పాటు పారిపోయింది. ఆ తర్వాత గ్వాలియర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను మేజర్‌నని.. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేసినట్టు ఫిర్యాదు చేసింది.. తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పోలీసులకు తెలిపింది.
అయితే ఈ విషయం తెలసుకున్న నిధి తండ్రి మున్నేష్, తన కుమార్తె చేసిన పనుల వల్ల కుటుంబ పరువు పోయిందని అవమానంగా ఫీల్ అయ్యాడు. అనంతరం వాళ్ల పెళ్లిని అంగీకరిస్తున్నట్టు నమ్మించి కుమర్తెను తమ ఆవాల తోట వద్దకు రమ్మని చెప్పాడు. కుమార్తె అక్కడికి రాగానే కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమెను హత్య చేశాడు. విషయం తెలుసుకున్న మున్నేష్ భార్య మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మున్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.