Crime News: నారాయణపేట జిల్లాలో విషాదం.. చెరువులో శవమై తేలిన తల్లి, రెండేళ్ల కూతురు..!

నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో రెండేళ్ల బిడ్డతో సహా తల్లి మృతి చెందింది.

Crime News: నారాయణపేట జిల్లాలో విషాదం.. చెరువులో శవమై తేలిన తల్లి, రెండేళ్ల కూతురు..!
Swim Death

Updated on: Sep 25, 2021 | 11:54 AM

Suspected deaths: నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో రెండేళ్ల బిడ్డతో సహా తల్లి మృతి చెందింది. ఇద్దరు మృతదేహాలు గ్రామశివారులోని చెరువులో కనిపించడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఊట్కూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో తల్లి, రెండేండ్ల చిన్నారి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు వారిది ఆత్మహత్య లేదా హత్య చేసి ఉంటారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also…  Flex Fuel Engines: కార్ల కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లకు మారాల్సిందే.. ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లు ఎలా పనిచేస్తాయంటే..