MJR chairman suicide : పీలేరు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పీలేరు – చిత్తూరు మార్గంలోని అగ్రహారం సమీపంలోని రైలు క్రింద పడి బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె గ్రామానికి చెందిన ఆగ్రహారం సమీంలో ఎంజేఆర్ కళాశాల నిర్వహిన్తున్నారు. కళాశాల ముగిసిన అనంతరం పులిచర్ల మండలానికి వెళ్లే మార్గంలో కోడిదిపల్లె ఈ బొమ్మలో గల రైల్వే గేట్ వద్దకు చేరుకొని గురువారం సాయంత్రం తిరుపతి – కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగంగా వెళ్తున్న రైలు వెంకటరమణారెడ్డి శరీరాన్ని 2 వందల మీటర్ల దూరం వరకు లాక్కుపోయినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, శరీర భాగాలు చిన్నాబిన్నంగా గుర్తుపట్టలేని విధంగా రైల్వే పట్టాలపై పడి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో పీలేరు పులిచెర్ల మండలాలకు చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని గుర్తించారు. మృతి చెందినది ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేతనే అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.