దొంగగా ముద్ర వేసి.. పెట్రోల్ పోసి.. నిప్పంటించారు

| Edited By: Srinu

Jul 20, 2019 | 6:27 PM

యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత వ్యక్తిని దొంగ అని భావించిన ఓ మూక.. అతడిపై దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడి శరీరం దాదాపు 30శాతం కాలిపోయింది. ప్రస్తుతం అతడు లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. సుజీత్ కుమార్(28) అనే వ్యక్తి గురువారం రాత్రి తన భార్యను తీసుకువచ్చేందుకు ఆమె గ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో రఘుపుర్వ అనే […]

దొంగగా ముద్ర వేసి.. పెట్రోల్ పోసి.. నిప్పంటించారు
Follow us on

యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత వ్యక్తిని దొంగ అని భావించిన ఓ మూక.. అతడిపై దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడి శరీరం దాదాపు 30శాతం కాలిపోయింది. ప్రస్తుతం అతడు లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. సుజీత్ కుమార్(28) అనే వ్యక్తి గురువారం రాత్రి తన భార్యను తీసుకువచ్చేందుకు ఆమె గ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో రఘుపుర్వ అనే గ్రామంలో అతడిని వీధి కుక్కలు వెంటపడటంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకు ఓ షెడ్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో అతడిని గమనించిన స్థానికులు శ్రవణ్ కుమార్, ఉమేష్, రామ్ లఖన్ మరో ఇద్దరు.. సుజీత్ దగ్గరకు చేరుకొని ప్రశ్నలను సంధించడం ప్రారంభించారు. తన భార్యను తీసుకెళ్లేందుకు తాను వారింటికి వెళ్తున్నానని సుజీత్ చెప్పినా.. వారు వినలేదు. అతడిని దొంగగా ముద్ర వేసి.. కొట్టడం ప్రారంభించారు. ఆ తరువాత సుజీత్‌పై పెట్రోల్ పోసిన ఆ మూక అతడికి నిప్పంటించారు. ఈ విషయాన్ని అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వారు సుజీత్‌ను కాపాడి, మొదట స్థానిక ఆసుపత్రికి.. తరువాత లక్నోకు తరలించారు. కాగా దీనిపై ఎస్టీ, ఎస్సీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి.. అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.