
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని దేవునిపల్లిలో ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గతకొద్ది రోజులుగా భర్తలేడన్న మానసిక వేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని తెలుస్తోంది. మృతురాలు పుల్లన్నగారి నవ్య (29)గా గుర్తించారు. మృతురాలకి ఓ తొమ్మిది ఏళ్ల పాపతో పాటు.. ఏడేళ్ల బాబు కూడా ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.