Telugu News Crime Maoists release letter in visakhapatnam urging government to take over private hospitals and provide medical treatment to covid
ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!
Maoists Release Letter: విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. కరోనా ఉద్ధృతి వేళ.. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలంటూ లేఖలో డిమాండ్ చేశారు.
విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. కరోనా ఉద్ధృతి వేళ.. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలంటూ లేఖలో డిమాండ్ చేశారు. జి. మాడుగుల మండలం మద్దిగారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు. ఇందులో మావోయిస్టులు.. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రా – ఒడిశా సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఆస్పత్రుల నిర్మాణం చేసి ప్రభుత్వ వైద్యులపై పని భారం తగ్గించాలి.
ప్రైవేటు వైద్య కళాశాలలను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి.
వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు తయారీ సంస్థలకు తక్షణం అనుమతులు ఇవ్వాలి.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలి.
రైతుల రుణలను మాఫీ చేయాలి.
రైతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలి.
కరోనా వేళ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను రద్దు చేయాలి.
అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలి.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్‌ను వెంటనే ఆపాలి.