Telangana News: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఆవులను దొంగిలించి ఆపై జింక మాంసం అంటూ..

Telangana News: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఎద్దులను, ఆవులను అపహరించి.. ఆపై వాటిని క్రూరంగా చంపి అడవి దుప్పి

Telangana News: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఆవులను దొంగిలించి ఆపై జింక మాంసం అంటూ..
Police Arrested

Updated on: Aug 27, 2021 | 3:50 PM

Telangana News: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఎద్దులను, ఆవులను అపహరించి.. ఆపై వాటిని క్రూరంగా చంపి అడవి దుప్పి, అడవి జింక మాంసం పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని జైపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. ఏడుగురు నిందితుల ముఠా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసబెట్టి ఎద్దులు, ఆవులను అపహరిస్తున్నారు. అలా అపహరించిన ఆవులను, ఎద్దులను గ్రామ శివార్లలో చంపేసి.. వాటి మాంసాన్ని అడవి దుప్పి, అడవి జింక మాంసంగా నమ్మించి జనాలకు విక్రయిస్తున్నారు.

దీనిని గమనించిన కొందరు జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, నిందితులను పట్టుకున్న జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, జైపూర్ ఎస్ఐ రామకృష్ణలను రామగుండం కమీషనర్ చంద్రశేఖర్ అభినందించారు.

Also read:

KCR: ‘ముమ్మాటికీ సభ్య సమాజమే కారణం, ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం’ : కేసీఆర్

Viral Video: అడవి దున్నను నోటకరిచిన సింహం.. వేటలో షాకింగ్ ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!

Act Fibernet: యాక్ట్‌ ఇంటర్నెట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్‌..!