Murder in Hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణమైన హత్య జరిగింది. ఓ వ్యక్తిని చంపిన గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. రోజులు గడిచేకొద్ది దుర్వాసన వస్తుండంటంతో.. తీరా అపార్ట్‌మెంట్ యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ఈ విషయం బయటపడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న 38 ఏళ్ల సిద్దిఖ్ అహ్మద్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచి బయట తాళం వేసి వెళ్లిపోయారు. సిద్దిఖ్ టైలర్ పని చేస్తుంటాడు.
రోజులు గడుస్తున్న కొద్ది ఆ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్ యజమానికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి పరిశీలించారు. ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన పోలీసులు.. తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. ఇది సిద్దిఖ్‌దిగా గుర్తించారు. ఇదిలాంటే.. రెండు రోజుల క్రితమే సిద్దిఖ్ భార్య రుబీనా తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే గొడవ పడి వెళ్లిందా? లేక ఎవైనా గొడవలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: