Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో చోరీలు ఎక్కువవుతున్నాయి. కొత్త కొత్త పన్నాగాలతో కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఇల్లు అద్దెకుకావాలంటూ వచ్చిన ఓ యువకుడు మహిళా మేడలో పుస్తెలతాడుని తెంపుకొని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబద్ లో వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గౌతమినగర్ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చాడు.అతడి మాటలు నమ్మింది ఉమాదేవి. అతడికి ఇంటిని చూపించే క్రమంలో ఆమె పై కత్తితో దాడి చేసి మెడలోని రెండ్నున తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని, ఆమె చేతిలోని సెల్ ఫోన్ ను లాక్కొని పారిపోయాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
హైదరాబాద్‌లో పబ్ పై ఆకస్మికంగా దాడి.. 28 మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..