నడిరోడ్డుపై మేనమామను నరికి చంపిన అల్లుడు

|

Sep 27, 2020 | 6:50 PM

రాను రానూ మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. తన మన భేదం లేకుండా దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా క్షణికావేశంలో ఓ వ్యక్తి పట్టపగలు మేనమామను అతి దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపాడు.

నడిరోడ్డుపై మేనమామను నరికి చంపిన అల్లుడు
Follow us on

రాను రానూ మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. తన మన భేదం లేకుండా దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా క్షణికావేశంలో ఓ వ్యక్తి పట్టపగలు మేనమామను అతి దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లోని వడ్డెర కాలనీలో సొంత మేనమామను అల్లుడు కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గొల్లెం నడిపి రాజం(60), అతడి మేనల్లుడు శివరాత్రి అంజయ్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం వడ్డెర కాలనీలోని హోటల్‌ వద్ద ఉన్న నడిపి రాజంపై ఒక్కసారిగా అంజయ్య దాడి చేశాడు. అంతటి ఆగకుండా కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. దీంతో నడిపి రాజం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.