Andhra Pradesh: మహిళ బాత్‌రూంలోకి తొంగి చూసిన పక్కింటి వ్యక్తి.. ఆమె భర్త నిలదీసేందుకు వెళ్లగా..

|

Feb 12, 2022 | 5:38 PM

AP Crime News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోరం జరిగింది. ఓ పోకిరీ చేసిన తుంటరి పనిని ప్రశ్నించడమే అతడికి శాపమైంది. కళకళలాడే కుటుంబంలో కన్నీరు మిగిల్చింది.

Andhra Pradesh: మహిళ బాత్‌రూంలోకి తొంగి చూసిన పక్కింటి వ్యక్తి.. ఆమె భర్త నిలదీసేందుకు వెళ్లగా..
Man Murder
Follow us on

Anantapur District: మహిళలు, యువతుల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా లెక్క చేయడం లేదు పోకిరీలు. ఎంత కఠినంగా శిక్షలు విధిస్తున్నా మారడం లేదు. అనంతపురం జిల్లా యర్రగుంట(Yerragunta Village)లో అలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడు చేసిన తప్పు పచ్చని సంసారాన్ని ఛిద్రం చేసింది. నిండు నూరేళ్లు భర్తతో హాయిగా ఉందామని కలలు కన్న ఆ వివాహితకు కన్నీరు మిగిలింది. ఓ యువకుడు చేసిన తప్పును ప్రశ్నించినందుకు దారుణ హత్యకు గురయ్యాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. యర్రగుంట గ్రామంలో రామమోహన్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రామమోహన్‌కు కల్యాణ్‌ అనే వ్యక్తితో పాతగొడవలు ఉన్నాయి. కక్షతీర్చుకోవాలనుకున్నాడో లేక భయపెట్టాలనుకున్నాడో తెలియదు గాని..రామ్‌ మోహన్‌ భార్యను బాత్‌రూంలోంచి తొంగి చూశాడు కల్యాణ్‌. ఇది గమనించిన వివాహిత ఇంటికి వచ్చిన భర్త రామ్‌ మోహన్‌కు విషయం చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌ మోహన్‌.. నిలదీసేందుకు కల్యాణ్‌ ఇంటికి వెళ్లాడు. ఎందుకిలా చేశావ్‌? అని ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదు కల్యాణ్‌.. ఎక్కడ తనపై దాడికి దిగుతాడోనన్న భయంతో ఈటెతో రామ్‌మోహన్‌పై దాడి చేశాడు కల్యాణ్‌.

ఈటె రామ్‌ మోహన్‌ గుండెలో బలంగా దిగడంతో అక్కడికక్కడే రక్తమడుగులో పడి చనిపోయాడు రామ్‌మోహన్‌. రామ్‌ మోహన్‌ను ఈటెతో పొడిచిన వెంటనే భయంతో పరారయ్యాడు కల్యాణ్‌. విషయం తెలుసుకున్న పోలీసులు కల్యాణ్‌ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలించి పట్టుకున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Also Read: Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్