పెళ్లి రోజే వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. భార్యను ఇంటి దగ్గర..

పెళ్లి రోజునే భర్త ప్రమాదంలో మరణించడంతో భార్య, అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు..

పెళ్లి రోజే వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. భార్యను ఇంటి దగ్గర..
Crime News

Updated on: May 30, 2022 | 8:15 PM

Road Accident in Adilabad: వారిద్దరూ పెళ్లి చేసుకొని ఏడాది అయింది. దీంతో ఆ జంట తమ కాపురం పచ్చగా ఉండాలంటూ ఆలాయానికి సైతం వెళ్లి పూజలు చేశారు. కానీ.. విధి వారి పాలిట శాపంగా మారింది. పెళ్లి రోజునే భర్త ప్రమాదంలో మరణించడంతో భార్య, అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జైనథ్ మండలం మండగాడ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహేష్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

పెళ్లి రోజును ఘనంగా జరుపుకునేందుకు ఉదయం దేవాలయంకు వెళ్లిన మహేష్.. భార్యను ఇంటి వద్ద దింపి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మండగాడ నుంచి మహారాష్ట్రకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మహేష్ బయలు దేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై మహేష్ బైక్‌ను మరోు వాహనం ఢీకొంది. దీంతో మహేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లి రోజే యువకుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us