Pushpa Style Red Sandalwood Smuggling: పుష్పా.. అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు. ఈ స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. కానీ.. అదే సినిమాలోని మరో సన్నివేశంను ఆదర్శంగా తీసుకున్న బెంగళూరుకు చెందిన ఓ యువకుడు కాపీ కొడుతూ దొరికిపోయాడు. అల్లు అర్జున్ నటించిన తెలుగు చిత్రం పుష్ప డైలాగ్స్, పాటలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. సినీ తారలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఫ్యాన్స్ పుష్ప డైలాగ్‌లు లేదా పాటలతో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. బెంగళూరులోని ఓ ఎర్రచందనం స్మగ్లర్ ‘పుష్ప’ సినిమా చూసి స్ఫూర్తి పొందాడు. సినిమా స్టైల్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఒక డ్రైవర్, రీల్‌పై స్మగ్లింగ్ చేసే సీన్ చూసి ప్రేరణ పొందాడు. నిజ జీవితంలో తన ట్రక్కులో ఎర్రచందనం కలపను స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అదే ట్రిక్‌ను అచ్చు అలానే చేయడానికి ప్రయత్నించాడు.
యాసిన్ ఇనయితుల్లా తన ట్రక్కులో కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు మార్గమధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. అతను సరిహద్దు దాటినప్పుడు.. సాంగ్లీ జిల్లాలోని మీరజ్ నగర్ గాంధీ చౌక్‌లో మహారాష్ట్ర పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం రూ.2.45 కోట్ల విలువైన చందనంతో పాటు రూ.10 లక్షల విలువైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుష్ప చిత్రంలో, నటుడు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మొదట ట్రక్కులో కలపను ఎక్కించి.. ఆ తరువాత పాలను స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఈ దృశ్యం నుంచి ప్రేరణ పొందిన యాసిన్ మొదట ఎర్రచందనంతో ట్రక్కును ఎక్కించాడు. దాని పైన పండ్లు, కూరగాయల పెట్టెలను ఎక్కించాడు. వాహనంపై, అతను COVID-19 అవసరమైన ఉత్పత్తుల స్టిక్కర్‌ను అతికించాడు.
పోలీసులకు చిక్కకుండా ఎలాగోలా కర్ణాటక సరిహద్దు దాటిన స్మగ్లర్.. మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకోలేక పోయాడు. ఇప్పుడు, అతని వెనుక ఉన్న నెట్‌వర్క్, వారు ఎలా పనిచేస్తున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..
RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..