Man Crushed in Lift: జీడిమెట్ల పారిశ్రామికవాడలో విషాదం.. తెగిపడిన లిఫ్టు చైన్.. మధ్యలో చిక్కుకుని మృతి చెందిన కార్మికుడు

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమకు చెందిన లిఫ్ట్‌లో చిక్కుకొని ఓ కార్మికుడు మృతి చెందాడు.

Man Crushed in Lift: జీడిమెట్ల పారిశ్రామికవాడలో విషాదం..  తెగిపడిన లిఫ్టు చైన్.. మధ్యలో చిక్కుకుని మృతి చెందిన కార్మికుడు
Man Died

Updated on: Apr 28, 2021 | 11:57 AM

Man Crushed to Death: హైదరాబాద్ మహా నగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి లిఫ్టులో ఇరుక్కుని దుర్మరణం పాలయ్యాడు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమకు చెందిన లిఫ్ట్‌లో చిక్కుకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓదేలు (40) కొంతకాలంగా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 6గంటల ప్రాంతంలో మొదటి అంతస్తులో లిఫ్ట్‌లో ఉన్న సామాగ్రిని తీస్తుండగా ప్రమాదం జరిగింది. చైన్‌ తెగిపోవడంతో లిఫ్ట్‌ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో కార్మికుడు లిఫ్ట్‌కు ఫ్లోర్‌కు మధ్యలో ఇరుక్కుపోవడంతో తీవ్రగాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడ్డ కార్మికుడిని తోటి సిబ్బంది హుటాహుటీన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చి చెప్పారు. కాగా, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు విచారణ చేపట్టారు.

Read Also…