
Man committed Suicide : ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు మందలించాడని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం అప్పుగా తెచ్చిన నగదును మద్యం కోసం ఖర్చు చేస్తున్నావంటూ తమ్ముళ్లు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అశ్వారావుపేట మండలం చెన్నాపురంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నాపురం గ్రామానికి చెందిన పెంటయ్య (32) తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నాడు. పంట సాగు కోసం పెట్టుబడికి తెచ్చిన డబ్బులతో అన్న మద్యం తాగుతున్నడని మంగళవారం మందలించాడు.. అప్పు చేసిన సొమ్మును వృధా చేశాడని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన పెంటయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పెంటయ్యను చికిత్స కోసం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెంటయ్య మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారిస్తున్నారు.