ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలే వారి పాలిట శాపంగా మారాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌ను హ్యాక్ చేసిన దుండగులు ఓ యూట్యూబర్ కుటుంబాన్ని అభాసుపాలు చేసింది. ముంబై మహానగరం బాంద్రాలో నివసిస్తున్న యూట్యూబర్ తన ఇల్లు, కుటుంబ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. అతని తల్లి, సోదరి ఇంట్లో ఉన్న సమయంలో వారి నగ్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై యూట్యూబర్ ముంబైకి చెందిన బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
21 ఏళ్ల యూట్యూబర్ భద్రతా ప్రయోజనాల కోసం తన ఇంటిలో అమర్చిన సీసీ టీవీ కెమెరాను బయటి వ్యక్తి హ్యాక్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ కెమెరాలో రికార్డయిన తన తల్లి, సోదరి నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని చెప్పాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, యూట్యూబర్ తన స్నేహితులలో ఒకరు తనకు ఫోన్ చేసి, తన తల్లి, సోదరి వ్యక్తిగత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని చెప్పాడు. ఈ సమాచారం ఆధారంగా తన ఇంట్లోని సీసీటీవీని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు బాధితుడికి తెలిసింది. వీడియో నవంబర్ 17, ఆమె తల్లి, సోదరి వేర్వేరు సమయాల్లో బట్టలు లేకుండా బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు అది సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వ్యక్తిగత వీడియోను కొందరు దుండగులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
యూట్యూబర్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 500, 501, ఐటీ సెక్షన్ 66(సీ), 66(ఈ), 67(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాంద్రా పోలీసు అధికారి మాట్లాడుతూ, ఈ చాలా సున్నితమైన అంశం.. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీటీవీ సిస్టమ్‌ను హ్యాక్ చేయడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా అన్ని సోషల్ మీడియా సైట్‌లను అభ్యర్థించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…