Crime News: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసిన భార్య

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త పెట్టే బాధలు భరించలేక ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది. పదే పదే తనను చిత్ర హింసలు పెడుతుంటడంతో భార్య తట్టుకోలేక తన భర్త మర్మాంగాన్ని కోసింది.

Crime News: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసిన భార్య
Wife Cuts Private Part Of Her Husband

Updated on: Sep 22, 2021 | 11:11 AM

Wife Kills Husband: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త పెట్టే బాధలు భరించలేక ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది. పదే పదే తనను చిత్ర హింసలు పెడుతుంటడంతో భార్య తట్టుకోలేక తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ సంచలన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భర్త బిచ్యానాయక్(45) నిత్యం ఎదోక కారణంతో తనను వేధిస్తున్నాడని కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. అతను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చేసరికి సత్యం రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

ఇది గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిచ్యానాయక్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోజూ గొడవలు, తగాదాలతో విసిగిపోయిన ఆమె.. మంగళవారం రాత్రి నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కొడవలితో కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపడుతున్నామన్నారు.

Read Also…  Tiger Terror: మనిషి రుచి మరిగిన పెద్ద పులి.. ఇప్పటికే 15 మంది బలి.. మహారాష్ట్ర సరిహద్దులో హడలెత్తిస్తున్న మృగం