
మధ్యప్రదేశ్‌లో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎరువులతో వెళ్తున్న ఓ రెండు లారీలను స్థానిక గ్రామస్ధులు అడ్డుకున్నారు. అంతేకాదు అందులో ఉన్న ఎరువుల సంచులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. సహకారం సంఘం అధికారులు ఈ ఎరువుల లారీలను తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లా సహకార సంఘం బ్యాంక్ సీఈవో ఏకే హర్సోలా తెలిపిన ప్రకారం.. రెండు లారీల్లో ఎరువుల సంచులను తరలిస్తుండగా.. ఓ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు లారీలను అడ్డుకున్నారని తెలిపారు. అంతేకాదు.. అందులో ఉన్న ఎరువుల సంచులను ఎవరికి అందినన్ని వారు దోచుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు లారీలను పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి అడ్డుకున్నట్లు సమాచారం.
Madhya Pradesh:2 trucks carrying fertilizers sent by district authorities to cooperative society were looted by people in Shajapur district.AK Harsola,CEO of Dist Cooperative Bank says, “We’re looking into the matter.We’ll file complaint after getting detailed report”. (18.06.20) pic.twitter.com/9ZsRu3RG2C
— ANI (@ANI) June 18, 2020