మధ్యప్రదేశ్‌లో అమానుషం.. ఓ గిరిజన మహిళపై యువకుడిని కూర్చొబెట్టి ఊరేగించిన స్థానికులు

|

Feb 16, 2021 | 3:49 PM

మధ్యప్రదేశ్‌లో ఒక అమానవీయ సంఘటన జరిగింది. ఓ గిరిజన మహిళ భూజాలపై ఓ వ్యక్తిని కూర్చొబెట్టి, కొట్టుకుంటూ ఊరేగించారు.

మధ్యప్రదేశ్‌లో అమానుషం.. ఓ గిరిజన మహిళపై యువకుడిని కూర్చొబెట్టి ఊరేగించిన స్థానికులు
Follow us on

Madhya Pradesh Horror :  మధ్యప్రదేశ్‌లో ఒక అమానవీయ సంఘటన జరిగింది. ఓ గిరిజన మహిళ భూజాలపై ఓ వ్యక్తిని కూర్చొబెట్టి, కొట్టుకుంటూ ఊరేగించారు. ఈ అనాగరికపు చర్య గుణ జిల్లాలో చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్న మహిళపై భర్త కుటుంబీకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ మహిళ భుజాలపై భర్త కుటుంబసభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించారు. భర్త కుటుంబానికి చెందిన కొందరు యువకులు మహిళ వెనక ఉండి.. ఆమె వేగం తగ్గినప్పుడల్లా పాశవికంగా కర్రలతో కొడుతూ ఊరంతా తిప్పారు. సాగై-బాన్స్‌ఖేడీ గ్రామాల మధ్య ఈ అమానుష ఘటన జరిగింది.

అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త అంగీకారంతోనే తాను విడిపోయినట్లు, ఇప్పుడు వేరే యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే భర్త తరఫు బంధువులు దారుణంగా వ్యవహరించారని పోలీసులకు తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొదటి భర్తతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

Read Also…  మహారాష్ట్రలో మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. మరోసారి లాక్‌డౌన్ దిశగా చెంబూర్‌..?