
వ్యవసాయ పొలంలో వేసిన బోరుగుంత ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. మద్యప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడేండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నివారి జిల్లా పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురబారా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రహ్లాద్ అనే మూడేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన స్థానిక అధికారులు ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఆర్మీ రెస్క్యూ సిబ్బందిని ఘటనా స్థలానికి రప్పించారు. రెస్క్యూ సిబ్బంది ఆ బాలుడి గొంతును విన్నట్లు నివారి జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. బాలుడ్ని బోరుబావి నుంచి వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
కాగా, బాలుడు ప్రహ్లాద్‌ను రక్షించేందుకు సహాయక చర్యల్లో కొనసాగిస్తున్నామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆ చిన్నారిని త్వరగా వెలికితీస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. దేవుడు ఆ బాలుడికి దీర్ఘాయువు ఇవ్వాలని, దీని కోసం మనమంతా ప్రార్థనలు చేద్దామంటూ చౌహాన్ ట్వీట్ చేశారు.
ओरछा के सेतपुरा गांव में बोरवेल में गिरे मासूम प्रह्लाद को बचाने के लिए स्थानीय प्रशासन के साथ सेना बचाव कार्य में जुटी है।
मुझे विश्वास है कि शीघ्र प्रह्लाद को सकुशल बाहर निकाल लिया जायेगा। ईश्वर बच्चे को दीर्घायु प्रदान करें, आप और हम सब मिलकर प्रार्थना करें।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 4, 2020