Lovers Suicide: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదనో లేదా పెద్దలను ఎదిరించలేకో ఈ నిర్ణయానికి వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర కాలని సమీపంలోని రైలు పట్టాలపై ఓ రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు ప్రాంభించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వారు దేశాయిపేటకు చెందిన సాయి, షకీనాగా గుర్తించారు. వీరు గత కొద్ది రోజుల నుంచి ప్రేమించుకున్నట్లు తెలిసింది. కాగా వీరి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.
Ghatkesar Rape Case: ఘట్‌కేసర్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు నిజాలు వెలుగులోకి..