Actor Sameera: ప్రముఖ సినీ నటికి హత్యా బెదిరింపులు చేసిన కళాశాల నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుళల్ సమీపం సూరపట్టుకు చెందిన మహ్మద్ ఇబ్రహీం కుమార్తె సమీరా సినీ నటి. ఈమె పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. కోడువల్లి జయసూర్య ఇంజినీరింగ్ కళాశాల నిర్వాహకుడు గోవిందరాజ్ తాను నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు అవకాశం ఇస్తానని ఆహ్వానించాడని, అక్కడికి వెళ్లగా శీతలపానీయంలో మత్తుమందు కలిపి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. తాను ఇంట్లో ఉన్న సమయంలో జయకుమార్, నక్కీరన్, పూర్ణిమ సహా ఎనిమిది మంది వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని లేకుంటే హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.