YS Sunitha : పులివెందులలో మా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత

019లో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన కుమార్తె సునీత జిల్లా ఎస్పీని కలిశారు. తమ ప్రాణాలకు ముప్పు..

YS Sunitha : పులివెందులలో మా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత కల్పించాలని  జిల్లా ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత
ys-sunitha

Updated on: Jun 16, 2021 | 12:19 AM

YS Vivekananda murder case : 2019లో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన కుమార్తె సునీత జిల్లా ఎస్పీని కలిశారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని వివేకా కుమార్తె సునీత కోరారు. కాగా, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి (68) గత ఎన్నికల ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం విశేషం. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కడప జిల్లా ఎస్పీని మంగళవారం కలిసి.. పులివెందులలో తనకు భద్రత కల్పించాలని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. తన ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా, వివేకా హత్యకేసులో సీబీఐ విచారణను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. సీబీఐకి చెందిన ఓ బృందం కడపలోనే మకాం వేసి అనుమానితులను ప్రశ్నిస్తూ కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది.

Read also : Hyper Aadi : ‘బాధపెట్టడం..  క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు.. సరైన సమయంలో సరైన రీతిలో ‘హైపర్ ఆది’కి బుద్ధి చెప్తాం’

Loading...
Unable to load recommendations.
Follow Us