ఎంతగా తనిఖీలు చేస్తున్నప్పటికీ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాలో కి మద్యం సరఫరా అవుతోంది. ఆంధ్ర కంటే తెలంగాణలో ధరలు తక్కువగా దొరుకుతుండటంతో కొందరు అక్రమార్కులు అక్రమ మద్యం వ్యాపారానికి అలవాటు పడ్డారు.. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి భారీగా మద్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ దొరికిపోతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇ సుబ్బారెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు వాహనాల్లో బాక్సుల కొద్ది మద్యం తరలిస్తుండగా కర్నూల్ శివార్లలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని మద్యాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశామని, అక్రమంగా మద్యాన్ని తరలించేవారు.. ఎంతటివారైనా సరే కటకటాల పాలు కావాల్సిందేనని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.