Kurnool Akbar Basha: కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సంచలన సృష్టించిన అక్బర్ కుటుంబం మరోసారి సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో మళ్లీ ఆత్మహత్యకు యత్నించింది అక్భర్ కుటుంబం. భూమి విషయంలో సీఐ వేధించారని ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది అక్భర్ ఫ్యామిలీ. సమస్యను పరిష్కరించలేదని, మరోసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది కుటుంబం. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోతో వివరించిన అక్బర్ బాషాతో సహా కుటుంబసభ్యులు ప్రాణాలు తీసుకునే ప్రయత్నించింది.
కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇద్దరు కూతుర్లతో సహా బాషా దంపతులు పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే నలుగురిని చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. బాషా కుటుంబం కర్నూలు జిల్లా చాగలమర్రిలో నివసిస్తోంది. కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలోని పొలం తగాదా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని గత కొద్దిరోజులుగా కుటుంబం పోరాడుతోంది.
అక్బర్‌బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలియగానే చాగలమర్తి, దువ్వూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పరిస్థితిపై సమీక్షిస్తున్నామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అక్బర్‌బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదని.. ఎకరన్నర భూమి అక్బర్‌బాషా అత్త ఖాసింబీదిగా మైదుకూరు కోర్టు 2018లోనే తీర్పు ఇచ్చిందిన్నారు. మైదుకూరు కోర్టు తీర్పుపై ఎవరూ పై కోర్టుకు వెళ్లేదని, అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ కోర్టులో తేల్చకోవాలని ఆయన సూచించారు. పోలీసులు సివిల్ విషయాల్లో తలదూర్చడం సరికాదన్నారు.
కడప జిల్లా దువ్వూరులో ఉన్న భూమి విషయంలో తమకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ బాషా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడతో సీఎం కార్యాలయం, కడప జిల్లా ఎస్పీ స్పందించారు. ఎస్పీ నుంచి సీఎం కార్యాలయం వివరాలను సేకరించింది. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని ఎస్పీ పిలిపించి మాట్లాడారు. సీఎంవో స్పందించడంతో ఈ వివాదం ముగిసిందని భావించారు. ఇంతలోనే ఆ కుటుంబం ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయడం కలకలంరేపింది.
Read Also… గూడూరు మండల ఎంపీటీసీ నూకల రాధిక మానవత్వం.. పేదింటి మహిళకు సొంత ఖర్చులతో సీమంతం వేడుక.. వీడియో