Constable Suicide: కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం.. అనుమానాస్పదస్థితిలో కానిస్టేబుల్ ఆత్మహత్య!

ఖమ్మం జిల్లా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఏఆర్ కానిస్టేబుల్.

Constable Suicide: కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం.. అనుమానాస్పదస్థితిలో కానిస్టేబుల్ ఆత్మహత్య!
Suicide

Updated on: Jan 10, 2022 | 12:39 PM

Khammam Constable Suicide: ఖమ్మం జిల్లా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

2020లో పోలీస్ ఏ.ఆర్ కానిస్టేబుల్ గా నియమితుడైన అశోక్ కుమార్ .. తరువాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలోలో పని చేశాడు. పోలీస్ శాఖలో బదిలీలో ప్రక్రియలో భాగంగా ఇటీవలే ములుగు జిల్లా కు బదిలీ అయ్యాడు. ఇదిలావుంటే, ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది.. డోర్ ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనాస్థలాని చేరుకున్న పోలీసులు.. డోర్ ఓపెన్ చేసి చూడక ఉరి వేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ప్రాణాలు విడిచాడు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం అశోక్ కుమార్ సొంత గ్రామం. ఇదిలావుంటే, ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్‌కు నిశ్చితార్థ కార్యక్రమం జరగాల్సి ఉంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read Also…  AP Oxygen Plants: ఏపీలో అందుబాటులోకి కృత్రిమ ప్రాణవాయువు.. ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్