Husband Beaten Up By 2 Wives: ఓ భర్త.. ఇద్దరు భార్యలు ఇవి సినిమాలకు చెందిన సూపర్ హిట్ కాన్సెప్ట్స్.. అదే నిజ జీవితంలోకి వచ్చేసరికి తన భర్తతనకు మాత్రమే సొంతం కావాలని ఏ భార్య అయినా కోరుకుంది.. అలా కాకుండా తన భర్త తనకు తెలియకుండా వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం భద్రకాళిగా మారుతుంది.. ఇక మొదటి భార్యాపిల్లల గురించి తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటే.. ఆ తర్వాత ఇద్దరు భార్యలకు అసలు విషయం తెలిస్తే.. ఆ భర్త వీపు విమానం మోతే.. ఇటువంటి ఘటన తాజాగా కామారెడ్డి లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి భువగిరిజిల్లాకు చెందిన వేముల పరశురామ్ అనే వ్యక్తికి బోర్ వెల్ వాహనాలు ఉన్నాయి. వాహన పనుల మీద వెళ్ళుతున్నానంటూ భార్యకు చెప్పి వారానికి రెండు మూడు రోజులు ఇంటికి రావడం మానేశాడు. మొదట్లో పరశురామ్ చెప్పిన కారణాన్ని నమ్మిన భార్య కు రోజు రోజుకీ భర్త ప్రవర్తన అనుమానం కలిగించింది. ఇక భార్య రోజుల నుంచి వారానికి ఆతర్వాత పనులున్నాయంటూ ఇంటికి మూడు నెలలు రాలేదు.. దీంతో మొదటి భార్యకు భర్త ప్రవర్తన మీద అనుమానం పూర్తిగా స్థిరపడింది. వేంటనే భర్తపై ఓ కన్నువేసింది. మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన భర్త మళ్ళీ పనిమీద ఉరువెళ్తున్నా తిరిగిరావడానికి టైం పడుతుంది అని చెప్పాడు..
పరశురామ్ ను ఫాలో అవుతూ మొదటి భార్య వెళ్ళింది. మొదటి భార్య ప్లాన్ తెలియని పరశురామ్ సరాసరి.. కామారెడ్డి లోని రెండో భార్య ఇంటికి వెళ్ళాడు. దీంతో అసలు విషయం అర్ధమైంది. తన భర్త ఎవరితోనో అక్రమసంబంధం పెట్టుకున్నాడని భావించి తన చుట్టాలందరినీ పోగు చేసింది. భర్త రెండో భార్యతో ఉన్న సమయంలో సడెన్ గా ప్రత్యక్షమయింది. మొదటి భార్యను చూసి షాక్ తిన్న పరశురామ్ తో పాటు రెండో భార్య పై దాడి చేయబోయింది. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది.
తనకు పెళ్ళయ్యి.. పిల్లలు ఉన్న సంగతి ఇప్పటి వరకూ తెలియదని.. తనకు అసలు పెళ్లి కాలేదని చెప్పి వివాహం చేసుకున్నాడంటూ రెండో భార్య ఏడ్పు మొదలు పెట్టింది. నన్ను కూడా మోసం చేశాడంటూ భర్త పై విరుచుకుపడింది. ఇద్దరు భార్యలు ఒకరికి తెలియకుండా మరొకరి జీవితాలను నాశనం చేశావంటూ భర్తను చావగొట్టారు. స్తానికులకు ఇది తెలియసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇద్దరు భార్యలు భర్తను కొట్టడం మానలేదు.. దీంతో పోలీసులు భర్త ని పోలీసులు తీసుకుని వెళ్లారు.
Also Read: