Jangoan Murder: జనగామ జిల్లాలో దారుణం.. భర్తను ఇనుప‌క‌డ్డీతో కొట్టి చంపిన భార్య

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో ఈ దారుణం జ‌రిగింది.

Jangoan Murder: జనగామ జిల్లాలో దారుణం.. భర్తను ఇనుప‌క‌డ్డీతో కొట్టి చంపిన భార్య
Suicide

Updated on: Sep 24, 2021 | 8:32 AM

Jangoan Husband Murder: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో ఈ దారుణం జ‌రిగింది. కట్కూరు గ్రామానికి చెందిన గుడిద అశోక్ (30), గుడిద అండాలు భార్యాభ‌ర్తలు. వీరికి 8 నెల‌ల బాబు కూడా ఉన్నాడు. అయితే, గ‌త కొంత‌కాలంగా భార్యాభ‌ర్తల మ‌ధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో తరుచుకు గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో గత రాత్రి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను భార్య ఇనుప‌క‌డ్డీతో కొట్టి చంపింది. అశోక్ అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండాలును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…   Hidden Treasure: మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవత విగ్రహానికి రక్తాభిషేకం.. గుడి ముందే చూస్తే..