IPS Officer Alleges Dowry Harassment:ఐపీఎస్ ఆఫీసర్ కు తప్పని వరకట్న వేధింపులు.. భర్త , అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు

|

Feb 07, 2021 | 8:59 AM

ప్రతి పనిలోనూ మగవారితో పోటీ పడి సామాజికంగా ఆర్ధికంగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు.. కానీ సామాన్య మహిళ నుంచి సమాజాన్ని రక్షించడానికి ఉన్నత పదవిలో ఉన్న మహిళకైనా వరకట్న వేధింపులు...

IPS Officer Alleges Dowry Harassment:ఐపీఎస్ ఆఫీసర్ కు తప్పని వరకట్న వేధింపులు.. భర్త , అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు
Follow us on

IPS Officer Alleges Dowry Harassment: మహిళలు అంబరాన్ని అందుకోవచ్చు.. సప్తసముద్రాల ఈదవచ్చు.. ప్రతి పనిలోనూ మగవారితో పోటీ పడి తనను తాను నిరూపించుకుంటూ సామాజికంగా ఆర్ధికంగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు.. కానీ సామాన్య మహిళ నుంచి సెలబ్రెటీ వరకూ సమాజాన్ని రక్షించడానికి ఉన్నత పదవిలో ఉన్న మహిళకైనా వరకట్న వేధింపులు తప్పవని మరోసారి రుజువు చేస్తోంది ఈ ఘటన.. కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి తనకు తన భర్త నితిన్ నుంచి రక్షణ కల్పించమని కోరారు. అదనపు కట్నం కోసం తన భర్త శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే..

2010 బ్యాచ్ కర్ణాటక ఐపిఎస్ అధికారి వర్తికా కటియార్ తన భర్త, ఐఎఫ్ఎస్ అధికారి నితీన్ సుభాష్ యోలా , అతని కుటుంబంపై బెంగళూరులో వరకట్న వేధింపులు గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశారు. కెఎస్‌ఆర్‌పి రీసెర్చ్ సెంటర్‌లో సూపరింటెండెంట్‌గా వర్తికా ప్రస్తుతం పనిచేస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న తన భర్త నితిన్, అతని కుటుంబం చేతిలో సంవత్సరాల తరబడి ఆర్థిక, మానసిక, శారీరక వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. ఈనెల 1వ తేదీన కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఈ కేసులో కర్ణాటక ఐపిఎస్ అధికారి భర్త నితిన్ కాకుండా మరో ఆరుగురు కుటుంబ సభ్యులను నిందితులుగా పేర్కొన్నారు. అతని తండ్రి సుభాష్ యెయోలా, తల్లి అమోల్ యెయోలా, బంధువులు సునీతా యోలా, సచిన్ యెయోలా, ప్రజక్త యోలా, ప్రద్న్య యోలా నిందితులుగా పేర్కొన్నారు.

2011 లో వర్తిక, నితీన్‌ లకు వివాహం జరిగింది.. పెళ్లి సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని తెలిపారు. అయితే, పెళ్లి తర్వాత బంగారు ఆభరణాలు కావాలని.. ఇంకా అందనపు కట్నం కోసం తనను అత్యంత దారుణంగా మానసికంగా, శారీరకంగా నితీన్ , అతని కుటుంబం సభ్యులు వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెళ్లి అయ్యినప్పటి నుంచి ఇప్పటి వరకూ పలుమార్లు తన పుట్టింటి నుంచి లక్షలాది రూపాయలను అదనపు కట్నంగా డిమాండ్ చేసి పుచ్చుకున్నరని .. వివాహం జరిగిన మూడు నెలల్లోనే రూ. 3 లక్షలు ఇవ్వక పొతే మీ అమ్మాయిని వదిలేస్తానని తన తల్లిదండ్రులను బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నారని తెలిపారు వర్తిక. తనను ఎక్కడ అల్లుడు వదిలేస్తాడో అనే భయంతో తన భర్త అడిగినప్ప్పుడల్లా నితిన్ కుటుంబ సభ్యుల డిమాండ్స్ ను తీరుస్తూ వస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.

అంతేకాదు 2012 లో ఉత్తర ప్రదేశ్ లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తే వారు రూ. 5లక్షల రూపాయలను చెక్ రూపంలో ఇచ్చారని తెలిపారు వర్తిక. డబ్బు కోసం మానసికంగా శారీరకంగా హింసించారని ఆ ఫిర్యాలో పేర్కొంది.
2016 లో కొలంబో పర్యటనకు వెళ్లిన సమయంలో తన భర్త నితిన్ తనను కొడితే అప్పుడు చేయి కూడా విరిగిందని ఆరోపించారు. తాను గర్భవతి గా ఉన్న సమయంలో కూడా శారీరకంగా హిసించడం మనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్తిక ఫిర్యాదుతో కట్నం నిషేధ చట్టం యొక్క సెక్షన్ 3 , 4 .. ఐపీఎస్ లోని పలు సెక్షన్ల కింద నిందితులందరిపై కేసు నమోదు చేశారు.

Also Read:

మెగాస్టార్‌కి జీవితాంతం రుణపడి ఉంటా!.. ఇది నాకు పూర్వజన్మలాంటిది.. అతడి వల్లే పూర్తిగా కోలుకున్నా..

బంగారం బాటలోనే వెండి ధరలు పై పైకి.. ఈరోజు వెండి ఎంత పెరిగిందో తెలుసా..!