Couple – Cheating Case: ఆ దంపతులు సోషల్ మీడియా వీడియోలతో ఫేమస్ అయ్యారు.. అయితే.. రొటీన్ వీడియోలు కాకుండా.. కాస్త మసాలా దట్టించి.. కుర్రకారుకు గాలం వేశారు. అందాల ఆరబోతతో ఎంతో మంది యువకులను ఎట్రాక్ట్ చేశారు. ఇంకేముంది.. డిఫరెంట్ స్టైట్‌లో లక్షల రూపాయలు కుచ్చుటోపీ పెట్టారు.. కన్నింగ్ కపుల్స్ చీటింగ్ అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీళ్లు మామూలోళ్లు కాదు. మోసగాళ్లకు మోసగాళ్లు. చీటర్ అనే పదానికి మమ్మీ డాడీలు. చాలా సరదాగా ఇలా టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ.. హాయిగా గడిపేస్తున్న ఈ జంట.. చాలా ఖరత్నాక్. మీ పిల్లలపై చదువులు చదివిస్తాం.. విదేశాల్లో మంచి సీటు ఇప్పిస్తామంటూ.. దారుణమైన మోసానికి పాల్పడ్డారు.
మత్తెక్కించే అందాలు.. మైమరపించే చిందులు.. ఈ అమ్మడి వేషాలు తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. అలాంటి జంట అపన్నంగా సంపాదించాలకున్నారు. ఇన్‌స్టా రీల్స్‌లో వీడియోలు.. చేస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు మత్తెక్కించారు. అంతవరకూ ఆగితే బానే ఉండు. కానీ ఆ తర్వాత వీళ్ల ఖతర్నాక్ కంత్రీ ప్లాన్.. దిమ్మతిరిగేలా ఉంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. పైచదువుల పేరుతో రూ. 44 లక్షలు కుచ్చుటోపీ పెట్టారంటూ గౌరీ శంకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉన్నత చదువులుకు పంపిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసారంటూ గోకవరంకు చెందిన మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ చీటింగ్ దంపతుల చిట్టా పెద్దగానే ఉంది. డ్యాన్సులు, వీడియోల ద్వారా వచ్చిన క్రేజ్ తో.. అమాయకులను నిలువునా ముంచారు. ఉద్యోగాల పేరుతో లక్షలకు లక్షలు కాజేశారు. సబ్సిడీ లోన్ల పేరుతో పంగనామాలు పెట్టిందీ కిలాడీ జంట.
డబ్బులు తీసుకుని ప్లేట్ ఫిరాయించడంతో.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను పట్టుకుని విచారింగా.. మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటకు వచ్చాయి. గౌరీ శంకర్ ఒక్కడే కాదు.. చాలా మందిని నిలువు దోపిడీ చేశారని తేలింది. ఉభయగోదావరి జిల్లాల్లో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
Read Also… వైభవంగా ముందుకు వస్తున్నా ‘మాస్ట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..: Maestro Pre Release Event Video.