ఇంట్లోనే అక్రమ మద్యం ఫ్యాక్టరీ.. ఐదుగురు అరెస్ట్..

మధ్యప్రదేశ్‌లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ ముఠాను ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇంట్లోనే అక్రమ మద్యం ఫ్యాక్టరీ.. ఐదుగురు అరెస్ట్..

Edited By:

Updated on: Jun 12, 2020 | 7:17 PM

మధ్యప్రదేశ్‌లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ ముఠాను ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఇంట్లోనే అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో.. ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఖజ్రానా పోలీసులు కలిసి ఆ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. శ్యామ్ సింగ్ అనే వ్యక్తి.. తన ఇంట్లోనే అక్రమంగా దేశీ మద్యం తయారు చేస్తున్నాడని.. అతడితో
పాటు మరో నలుగురు కూడా ఉన్నారని తెలిపారు. వీటిని మార్కెట్లో అక్రమంగా సేల్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 320 లీటర్ల స్పిరిట్‌,3.9 లక్షల స్టిక్కర్లు, 6.5 లక్షల లిక్కర్ బాటిల్‌ క్యాప్స్‌,130 లీటర్ల కార్మెల్ కలర్‌, 3000 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరు తయారు చేసిన ఈ అక్రమ మద్యం
బాటిళ్లను మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.