Loan Apps Case: లోన్ యాప్స్ కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు.. ఈ కంత్రీగాడి కన్నింగ్ పని ఏంటంటే

|

Aug 30, 2021 | 8:59 PM

లోన్ యాప్స్ కేసులో స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును మళ్లించినందుకు ఓ బ్యాంకు మేనేజర్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా...

Loan Apps Case: లోన్ యాప్స్ కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు.. ఈ కంత్రీగాడి కన్నింగ్ పని ఏంటంటే
Loan Apps Case
Follow us on

లోన్ యాప్స్ కేసులో స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును మళ్లించినందుకు ఓ బ్యాంకు మేనేజర్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా అలీపూర్‌ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ రాకేశ్‌ కుమార్‌ దాస్‌ ఈ కన్నింగ్ పని చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిలిపివేసిన అకౌంట్లలో నుంచి నగదు బదిలీ అయిందని జూన్‌లో గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కోల్‌కతాలోని ఆలీపూర్‌ బ్రాంచ్‌ నుంచి రూ.1.18 కోట్ల నగదు బదిలీ అయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దర్యాప్తు చేసిన పోలీసులు మేనేజర్‌ రాకేష్‌ కుమార్‌ దాస్‌ను ప్రశ్నించగా.. సైబర్‌ క్రైం ఎస్సై బ్రాంచ్‌కు వచ్చి నగదు డీప్రీజ్‌ చేయమని చెప్పాడని అందుకే నగదు బదిలీ చేసినట్లు వెల్లడించాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా… కమిషన్‌ కోసం ఖాతాల్లో నుంచి నగదు బదిలీ చేసినట్లు వెల్లడైంది. ఎస్సైలా వెళ్లిన ఆనంద్‌ జన్నును, అతనికి సహకరించిన నల్లమోతు అనిల్‌ కుమార్‌ను జూన్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే

కొంత కాలం కిందట హైదరాబాద్‌ సైబర్‌ పీఎస్‌లో నమోదైన ఓ కేసులో కోల్‌కతా, గుర్‌గావ్‌లలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న నిందితుల ఖాతాల లావాదేవీలను పోలీసులు నిలిపివేశారు . ఇటీవల ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌  కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి తనకు తాను కోల్‌కతా సైబర్‌ ఎస్సైనంటూ మాయమాటలు చెప్పి, ఫేక్ ఐడీ చూపించాడు. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు స్తంభింపజేసిన అకౌంట్‌ను పునరుద్ధరించడానికి పర్మిషన్ ఇచ్చారంటూ ఓ ప్రతిని బ్యాంకు అధికారులకు అందజేశాడు. గుర్‌గావ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లోనూ అదే సమయంలో ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. దీంతో బ్యాంకు అధికారులు ఆ ఖాతా సర్వీసును పునరుద్ధరించారు. దీంతో నిమిషాలు వ్యవధిలోనే రెండు ఖాతాల్లోని మొత్తం రూ.1.18 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఇదంతా వెంటనే జరిగిపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు విచారణ చేస్తే.. ఉత్తర్వుల ప్రతులన్నీ ఫేక్ అని తేలింది. వెంటనే హైదరాబాద్‌లోని బ్యాంకు అధికారులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు. అలెర్టైన పోలీసులు..  కోటి 18 లక్షల రూపాయలు హైదరాబాద్​ బేగంపేటకు చెందిన ఆనంద్​ గన్నోజు అనే వ్యక్తి ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. అతని ఖాతాను స్తంభింపచేశారు.

 అయితే అప్పటికే ఆ డబ్బు అంతా చైనాకు బదిలీ అయినట్లు సైబర్​ క్రైం పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఫేక్ ఎస్సై అనిల్ కుమార్​ను అరెస్టు చేశారు. ఫ్రీజ్‌ చేసిన బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైం పోలీసుల పేరుతో లేటర్‌ ప్యాడ్‌లు, స్టాంపులు తయారు చేసి ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ఆయా బ్యాంకులకు నేరగాళ్లు పంపించినట్లు గుర్తించారు.

Also Read:“తాలిబన్లను టెర్రరిస్టులని పిలవరు.. వారి పాలనపై ఒక్క ప్రకటన కూడా చెయ్యరు”.. మోదీ సర్కార్‌పై అసదుద్దీన్‌ ఫైర్

Ganji: అయ్యో..! అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? పెద్ద తప్పే చేస్తున్నారు.