రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ అధికారులు

|

Jul 03, 2019 | 7:11 PM

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… కుషాయిగూడ బస్ డిపోకు చెందిన డ్రైవర్ జగదీష్… బస్సులో కూర్చొని రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో అప్పుడే రోడ్లను పరిశుభ్రం చేసిన జీహెచ్ఎంసీ కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. వెంటనే ఈ విషయంపై  ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవర్ జగదీష్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా […]

రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ అధికారులు
Follow us on

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… కుషాయిగూడ బస్ డిపోకు చెందిన డ్రైవర్ జగదీష్… బస్సులో కూర్చొని రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో అప్పుడే రోడ్లను పరిశుభ్రం చేసిన జీహెచ్ఎంసీ కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

వెంటనే ఈ విషయంపై  ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవర్ జగదీష్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా చెల్లించాలన్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లింగంపల్లిలో ఉన్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి మరీ జరిమానా విధించడం గమనార్హం.

కాగా పరిశుభ్రతనే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది జీహెచ్‌ఎంసీ. రోడ్లపై ఎక్కడ పడితే చెత్త వేసినా , ఎక్కడ బడితే అక్కడ ఉమ్మినా చర్యలు తీసుకుంటున్నారు . అంతేకాకుండా హైదరాబాదులోని వేంకటాద్రి నగర్ కాలనీకి చెందిన రవీందర్‌ రెడ్డి అనే వ్యక్తి రోడ్డుపై చెత్త వేసాడని అతనికి ముప్పై వెయిల రూపాయల జరిమానా విధించారు. ఇక పబ్లిక్ స్మోకింగ్ విషచంలోనూ  జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పోలీసులతో డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.