Hyderabad: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన భార్య.. మనోవేదనతో భర్త ఏం చేశాడంటే..

|

May 06, 2022 | 1:57 PM

Gandhi Hospital: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌ ఆరో అంతస్తు నుంచి దూకి కొంరయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Hyderabad: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన భార్య.. మనోవేదనతో భర్త ఏం చేశాడంటే..
Follow us on

Gandhi Hospital:  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌ ఆరో అంతస్తు నుంచి దూకి కొంరయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘మృతుడు కొంరయ్య భార్య కడుపునొప్పితో గత కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్య అనారోగ్యం బారిన పడడం, కొంరయ్య ఒంటరివాడయ్యాడు. మనో వేదనతో (సైకలాజికల్‌ డిస్టబెన్స్‌)కు గురయ్యాడు. దీంతో ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించాం’ అని సూపరింటెండెంట్‌ తెలిపారు.

కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రి అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Monkey Fever: అక్కడ కలకలం రేపుతోన్న మంకీ ఫీవర్‌.. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు..

Manju Warrier: స్టార్‌ హీరోయిన్‌పై డైరెక్టర్ వేధింపులు.. మఫ్టీలో వెళ్లి అరెస్ట్‌ చేసిన పోలీసులు..

Coronavirus: దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. మహారాష్ట్రలోనూ పెరుగుతున్న బాధితులు.. నిన్న మొత్తం ఎన్ని కేసులంటే..