Hyderabad Crime: సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిని హోటల్‌కు తీసుకెళ్లి..!

కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా.. కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నిత్యం ఏదో మహిళలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పుడుతూనే ఉన్నారు. వావి వరసలు మరిచి క్రూరుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురు వరసమ్యే అమ్మాయిపై ఓ ఉన్మాది అఘాయిత్యం చేశాడు. యువతికి సినిమాలపై ఉన్న ఆకర్షణను అలుసుగా తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Hyderabad Crime: సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిని హోటల్‌కు తీసుకెళ్లి..!
Crime News

Updated on: Feb 03, 2024 | 2:08 PM

కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా.. కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నిత్యం ఏదో మహిళలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పుడుతూనే ఉన్నారు. వావి వరసలు మరిచి క్రూరుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురు వరసమ్యే అమ్మాయిపై ఓ ఉన్మాది అఘాయిత్యం చేశాడు. యువతికి సినిమాలపై ఉన్న ఆకర్షణను అలుసుగా తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

మూసాపేటకు చెందిన ఓ మహిళకు ముగ్గురు ఆడ పిల్లలు. భర్త చాలా ఏళ్ల క్రితమే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం లింగంపల్లిలో ఉండే కృష్ణారావు అనే వ్యక్తి సదరు మహిళకు పరిచమయ్యాడు. అప్పట్నుంచి వారివురూ సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో గతకొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. మహిళ పెద్ద కుమార్తెకు సినిమాలంటే ఇంట్రస్ట్. వెండితెరపై తనని చూసుకోవాలని ఆరాట పడుతూ ఉండేది.

ఆమెకు నటనపై ఉన్న ఆసక్తిని ఆసరగా తీసుకున్న కృష్ణారావు.. వెబ్ సిరీస్‌లో మంచి వేషం ఉందంటూ నమ్మించాడు. మాయమాటలతో యూసఫ్‌గూడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆనంతరం కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మోసపోయానని తెలుసుకున్న అమ్మాయి తన తల్లికి చెప్పగా, మధురానగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…