Telangana Crime: భార్యను వదిలించుకునేందుకు భర్త దారుణం.. ఏం చేశాడో తెలిస్తే షాక్

|

Feb 08, 2022 | 11:58 AM

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్(Armoor) లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలతో కట్టుకున్న భర్త అమానుషంగా వ్యవహరించాడు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని...

Telangana Crime: భార్యను వదిలించుకునేందుకు భర్త దారుణం.. ఏం చేశాడో తెలిస్తే షాక్
Wife Drugs
Follow us on

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్(Armoor) లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలతో కట్టుకున్న భర్త అమానుషంగా వ్యవహరించాడు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. స్కిన్ ఎలర్జీ కోసం ట్రీట్ మెంట్ పేరుతో భార్య నరాలకు స్టెరాయిడ్స్(Steroids) ఎక్కించాడు. అనుమానం వచ్చిన భార్య ఆసుపత్రిలో చూపించుకోగా అసలు విషయం బయటపడింది. ఆర్మూర్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తూనే.. గంగాసాగర్ ఆర్ఎంపీగా క్లినిక్ పెట్టుకోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్రవంతి, గంగా సాగర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 2017వ సంవత్సరంలో వివాహం జరిగింది. అనంతరం వీరికి కుమారుడు జన్మించాడు. గంగా సాగర్ ఆర్మూర్‌లోనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్నాడు. అంతే కాకుండా ఆర్ఎంపీగా మరో చోట క్లినిక్ నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో 25 ఏళ్ల వయసులోనే స్రవంతి నరాల బలహీనతకు గురైంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిచుకుంది. ఫలితాల్లో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆమె రక్తంలో స్టెరాయిడ్స్ కి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో స్రవంతి కంగుతింది. స్రవంతికి తన భర్తపై అనుమానం వచ్చింది. తన భర్తే ఇంజెక్షన్ల రూపంలో తనకు ఓ మెడిసిన్ ఇస్తున్నాడని చెప్పింది. వెంటనే ఈ విషయం గురించి బాధితురాలు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన సమస్యపై పోలీసులు పట్టించుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యమంతమైంది.

Also Read

Black Magic: వణుకు పుట్టిస్తున్న క్షుద్రపూజలు.. ఇంట్లో గుంతలు తవ్వి.. పసుపు కుంకుమలు చల్లి..

Viral Video: ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికీ ఉండకూడదు..! అసలు విషయం తెలిస్తే పాపం అనిపించక ఉండదు…(వీడియో)

Manchu Vishnu: ‘సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్’.. మంచు విష్ణు సంచలన కామెంట్స్