ఏజెన్సీలో గుప్పుమంటున్న మత్తు మందు.. కిలాడీ లేడీ అరెస్ట్‌తో గుట్టురట్టు.. వెయ్యికిలోల గంజాయి స్వాధీనం..!

|

Apr 19, 2021 | 7:09 AM

ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది.. అక్రమ దందాతో స్మగర్ల ఆగడాలకు అడ్డుకట్టపడటంలేదు. యువతే టార్గెట్‌ను చేసి గంజాయి మత్తులో దించుతున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు.

ఏజెన్సీలో గుప్పుమంటున్న మత్తు మందు.. కిలాడీ లేడీ అరెస్ట్‌తో గుట్టురట్టు.. వెయ్యికిలోల గంజాయి స్వాధీనం..!
Huge Quantity Of Ganja Seized
Follow us on

Ganja Seized:  ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది.. అక్రమ దందాతో స్మగర్ల ఆగడాలకు అడ్డుకట్టపడటంలేదు. యువతే టార్గెట్‌ను చేసి గంజాయి మత్తులో దించుతున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం లో ఓ మాయలేడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతకు గంజాయిని అలవాటు చేసి.. వారికి పెద్ద ఎత్తున ఈ కిలాడీ లేడీ గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు కిలాడీ లేడీతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి చిన్న చిన్న ప్యాకెట్లుగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు విశాఖ ఏజెన్సీలో అధికారులు ఎంత నిఘా పెడుతున్నా గంజాయి స్మగ్లర్ల ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా.. డుంబ్రిగుడ మండలం గోరాపూర్‌ వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులకు.. ఓ వ్యాన్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. వెరిఫై చేసే సరికి గంజాయి ఘాటు గుప్పుమంది. తనిఖీ చేసి వ్యాన్‌లో వెయ్యికిలోల వరకు గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వ్యాన్‌తో పాటు గంజాయిని సీజ్‌ చేశారు అధికారులు.

ఇటు పార్వతీపురంలో భారీ నాటు సారా స్వాధీనం చేసుకున్నారు ఎస్‌ఈబీ పోలీసులు. ఒడిషాలోని ఆలమండ నుంచి టాటా సుమోల ద్వారా క్యాన్లలో పెద్ద ఎత్తున నాటు సారా తరలిస్తుండగా పోలీసులు వల వేసి పట్టుకున్నారు. మొత్తం 360 లీటర్ల నాటుసారాతో పాటు టాటా సుమోను పోలీసులు సీజ్‌ చేశారు.

Read Also…  

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నిత్యావసరాలకు కోసం వెళ్లి ఆరుగురు కూలీల మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Texas Shooting: అమెరికాలో తీవ్రస్థాయికి చేరిన గన్ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో మరో ముగ్గురు మృతి