తాజ్ బంజారాకు బడా టోకరా..రూ.13లక్షల బిల్ చేసి పరారైన కస్టమర్ ..!

| Edited By: Ravi Kiran

Aug 09, 2019 | 5:53 PM

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్ కు ఓ వ్యాపార వేత్త టోకరా వేశాడు. 102 రోజుల పాటు హోటల్ లో బస చేశాడు.. చివరకు రూ.13 లక్షల బిల్లు చేల్లించకుండా పరారయ్యాడు..దీంతో చేసేది లేక తాజ్ బంజారా హోటల్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం వినాయటెంపుల్ సమీపంలోని కిర్లంపూడి లేఅవుట్ లో ఉన్న సాగర్ దీప అపార్ట్ మెంట్స్ లో నివసించే అక్కింశెట్టి శంకర్ నారాయణగా గుర్తించారు. గతేడాది […]

తాజ్ బంజారాకు బడా టోకరా..రూ.13లక్షల బిల్ చేసి పరారైన కస్టమర్ ..!
Follow us on

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్ కు ఓ వ్యాపార వేత్త టోకరా వేశాడు. 102 రోజుల పాటు హోటల్ లో బస చేశాడు.. చివరకు రూ.13 లక్షల బిల్లు చేల్లించకుండా పరారయ్యాడు..దీంతో చేసేది లేక తాజ్ బంజారా హోటల్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం వినాయటెంపుల్ సమీపంలోని కిర్లంపూడి లేఅవుట్ లో ఉన్న సాగర్ దీప అపార్ట్ మెంట్స్ లో నివసించే అక్కింశెట్టి శంకర్ నారాయణగా గుర్తించారు. గతేడాది ఏప్రిల్ 4న తాజ్ బంజారా హోటల్ కు వచ్చాడు శంకర్ నారాయణ. తాను వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చానని,  ఏడాదిపాటు ఇక్కడే ఉంటానని లాంగ్ పిరియడ్ అగ్రిమెంట్ పై ఒకే రూమ్ తీసుకున్నాడు. దీంతో హోటల్ లోని రూమ్ నెంబర్. 405ని కేటాయించారు సిబ్బంది.

అయితే, మధ్యలో రూ. 13.62 లక్షల బిల్లును చెల్లించాడు. అప్పటి నుంచి హోటల్ నిర్వాహకులను నమ్మిస్తూ..తర్వాత బిల్లులు వాయిదాలు వేస్తూ వచ్చాడు. గత ఏప్రిల్ 15వ తేదీన శంకర్ నారాయణ్ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా శంకర్ నారాయణ మాత్రం రావటంలేదు. గతేడాది ఏప్రిల్ నుండి మొత్తం 102 రోజులకుగానూ హోటల్ బిల్లు రూ. 25,96,693 కాగా అందులో రూ.13,62,149 చెల్లించాడు. మిగతా రూ. 12,34,544 బాకీ పడ్డాడు. ఈ మొత్తాన్నికట్టకుండానే రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. దీంతో శంకర్ నారాయణ తమకు కుచ్చిపెటీ పెట్టడాని భావించిన తాజ్ బంజారా హోటల్ సిబ్బంది బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.