DRI Seizes Drugs: దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్‌ను డీఆర్‌ఐ అధికారులు గుట్టురట్టుచేశారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడింగ్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి నిషేధిత మాదకద్రవ్యాలతో వచ్చిన రెండు షిప్ కంటైనర్లను నిఘా వర్గాల సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. టాల్కమ్ పౌడర్ తరలిస్తున్నట్లు వాటి పత్రాల్లో పేర్కొనగా.. అనుమానంతో అధికారులు తనిఖీలు చేశారు. వాటిల్లో క్షణ్ణంగా తనిఖీలు చేపట్టగా భారీగా హెరాయిన్ బయటపడింది. వాటి విలువ దాదాపు రూ.9వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆషి ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు కంటైనర్లను స్వాధీనం చేసుకోని విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు ఈ షిప్పులతో లింకులు ఉన్న ప్రాంతాల్లో దాడులు సైతం నిర్వహిస్తున్నారు. గుజరాత్ ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, మాండ్వి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రాకెట్‌లో ఆఫ్ఘన్ జాతీయుల ప్రమేయం కూడా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీకి.. సెమీ ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రవాణా అయ్యాయి. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి ముంద్రా పోర్టుకు సరుకు రవాణా అయినట్లు అధికారులు తెలిపారు.
Also Read: