Road Accident: ట్రాక్టర్ కింద పడ్డా బ్రతికి బయటపడ్డారు.. కారణం ఆ ఒక్కటే..

|

Sep 17, 2021 | 7:34 AM

Road Accident: బైక్ రైడింగ్‌లో కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. హెల్మెట్‌ పెట్టుకోవటం వల్ల ఎంతోమంది ప్రమాదాల బారినుండి బైటపడగలిగారు.

Road Accident: ట్రాక్టర్ కింద పడ్డా బ్రతికి బయటపడ్డారు.. కారణం ఆ ఒక్కటే..
Accident
Follow us on

Road Accident: బైక్ రైడింగ్‌లో కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. హెల్మెట్‌ పెట్టుకోవటం వల్ల ఎంతోమంది ప్రమాదాల బారినుండి బైటపడగలిగారు. తాజాగా టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్.. బైక్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన హెల్మెట్ ధరించడం వల్లే భారీ ప్రమాదం తప్పిందని వైద్యులు, పోలీసులు తెలిపారు. అయితే, ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఆక్సిడెంట్‌లోనూ కేవలం హెల్మెట్ పెట్టుకోవడం వల్లే భారీ ప్రమాదం తప్పింది. ఆ హెల్మెట్ కారణంగానే ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

గుజరాత్‌లోని దహోద్ నగరంలో జరిగిన ఈ భయానక ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ ఓ బైక్ రైడర్ గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డుపై పడిపోయాడు. బైక్ పై ఓ మహిళతో పాటు చిన్నారి కూడా ఉన్నారు. అదే సమయంలో ట్రాక్టర్ ట్రాలీ అటు నుంచి వెళుతోంది. బైక్ పడగానే, ఆ యువకుడు ట్రాలీ కిందకు పడిపోయాడు. ట్రాలీ చక్రం అతని తలపై నుంచి ముందుకు వెళ్లింది. కానీ, అతను హెల్మెట్ ధరించినందున పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఎంత ఘోరం జరిగుండేదో ఈ సీన్‌ చూస్తే అర్థమవుతుంది. హెల్మెటే అతని ప్రాణాలను కాపాడిందని చెప్పాలి.

కాగా, ఈ ప్రమాదం హైవే సిగ్నల్‌పై అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయింది. బైక్‌పై వెళ్తున్న జంటతో పాటు వారి కుమారుడు కూడా ఉన్నాడు. బిడ్డ తల్లి ఒడిలో ఉంది. బైక్ నుంచి కింద పడిన తర్వాత, ఆ మహిళ తన కొడుకుతో కలిసి రోడ్డుకు మరోవైపు పడిపోయింది. దీంతో వారిద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ యువకుడికి కొన్ని గాయాలు అయ్యాయి. కానీ, అతను మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. హెల్మెట్ లేకపోతే ఎంత ఘోరమైన ప్రమాదం జరిగేదోనంటూ.. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో హెల్మెట్ ప్రాధాన్యతను పేర్కొంటూ ఈ ఫోటోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

Also read:

IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మిడ్ నైట్ రోమన్స్.. ఆ కాటెస్టెంట్‌‌కు టైట్ హగ్ ఇచ్చిన లహరి..

Hyderabad: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా.. 20 ఏళ్ల జైలు శిక్ష