Crime News: పోలీస్ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌.. హర్యానాలో తీగ లాగితే, హైదరాబాద్‌లో కదిలిన డొంక

|

Aug 11, 2021 | 3:25 PM

హర్యానాలో కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌కు సంబంధించిన లింక్ హైదరాబాద్‌‌లో బయటపడింది. హైదరాబాద్‌ లోని...

Crime News: పోలీస్ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌.. హర్యానాలో తీగ లాగితే, హైదరాబాద్‌లో కదిలిన డొంక
Constable Exam Paper Leak
Follow us on

హర్యానాలో కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌కు సంబంధించిన లింక్ హైదరాబాద్‌‌లో బయటపడింది. హైదరాబాద్‌ లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పరీక్షా పత్రం లీకయినట్టు హర్యానా పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యంతో ఫతేబాద్‌, హోసర్‌, కౌతల్‌ ప్రాంతానికి చెందిన కోచింగ్‌ సెంటర్‌ యాజమానులు చేతులు కలిపి ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రించిన ఎగ్జామ్‌ పేపర్లను నేరుగా కోచింగ్‌ సెంటర్లకు పంపిణీ చేశారు. కచ్చితంగా ఉద్యోగమంటూ ప్రతి అభ్యర్ధితో కోటి రూపాయల డీల్‌ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కో అభ్యర్ధి నుంచి 30 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. పేపర్‌ లీకేజ్‌పై దర్యాప్తు కోసం హైదరాబాద్‌కు వచ్చిన హర్యానా పోలీసులు ఈ కేసులో ప్రధాన సూత్రధారి నరేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలకు భారం కావొద్దని వృద్ధ జంట ఆత్మహత్య

పిల్లలకు భారం కాకూడదని వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విచారకర ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా జాఫర్​ఘడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన తాటికాయల మల్లయ్య, ఎల్లమ్మ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో తరుచుగా ఆస్పత్రికి వెళ్తూ.. మందులు వాడాల్సి వస్తుంది. దీంతో పిల్లలకు భారంగా మారామని ఇరువురం ప్రాణాలు తీసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన ఆ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగారు. ముందుగా ఎల్లమ్మ స్పాట్‌లోనే ప్రాణాలు విడువగా, కొన ఊపిరితో ఉన్న సాయిలును అంబులెన్సులో వరంగల్ ఎంజీఎంకు తరలించే క్రమంలో చనిపోయాడు. కలిసి జీవిద్దామని ఒక్కటైన ఆ జంట వృద్ధాప్యానికి తలొగ్గి మరణించడం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది.

Also Read:  కడప జిల్లా డి నేలటూరు డబుల్ మర్డర్స్ కేసులో వీడిన మిస్టరీ

సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు