
మానవ సంబంధాలు సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి చోటు చేసుకుంది. హరిద్వార్‌లోని కంఖాల్ ప్రాంతంలో తండ్రి తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన దారుణ సంఘటన జరిగింది. తన 17 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసినందుకు 60 ఏళ్ల తండ్రిని అరెస్టు చేశారు. ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి మాత్రమే కాదు, ఆమె ప్రియుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రియుడు ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఫలితంగా రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. పోలీసులు తండ్రి, ప్రియుడు ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
బాధితురాలి అక్క అక్టోబర్ 7న కంఖల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. తన సోదరి పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళవారం ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె తెలిపింది. బాలికకు గర్భస్రావ మాత్రలు ఇచ్చారని, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను వేరే ఆసుపత్రిలో చేర్చారని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె పోలీసులకు భయంకరమైన వివరాలను వెల్లడించింది. తన సొంత తండ్రి తనపై అత్యాచారం చేశాడని, తాను గర్భవతి అని తెలియగానే, దానిని తొలగించడానికి మాత్రలు తీసుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది.
ప్రియాడు ప్రియాంష్ బాధితురాలి తండ్రితో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని, అతని ఇంటి దగ్గరే నివసిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. తన కుమార్తెకు ప్రియాంష్ తో ఉన్న ప్రేమ సంబంధం గురించి తండ్రికి తెలుసు, ఆమె మునుపటి గర్భం గురించి కూడా అతనికి తెలుసు. తన కుమార్తెను రక్షించుకోవడానికి బదులుగా, తండ్రి పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి