AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడిపై యాసిడ్ దాడి

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. లవర్ పై ప్రియురాలు చేసిన యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రియుడిపై యాసిడ్ దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 04, 2020 | 11:13 AM

Share

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ప్రియుడిపై ప్రియురాలు చేసిన యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

కర్నూలుజిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో వారం రోజుల క్రితం మరో అమ్మాయితో ప్రియుడు నాగేంద్రకు వివాహం జరిగింది. అయితే ఆ వివాహాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలు యాసిడ్‌ దాడి చేసింది. గాయాలతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ప్రియుడు నాగేంద్ర పెద్దకొట్టాల గ్రామానికి చెందిన యువతితో ప్రేమాయణం నడిపాడు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో నాగేంద్ర కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రియుడు నాగేంద్ర ఆగస్టు 3వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ప్రియుడి చేతిలో మోసపోయానని భావించిన ఆ యువతి అతడిపై కక్ష పెంచుకుంది. అయితే ఇవాళ ఉదయం నాగేంద్ర నంద్యాలకు వెళ్తున్న విషయాన్ని తెలుకున్న యువతి..తన ఇంటి ముందు నుంచే దారి ఉండటంతో అతని కోసం కాపు కాసింది. బైక్ ఇంటికి ముందుకు రాగానే ఒక్కసారిగా ప్రియుడు నాగేంద్రపై యాసిడ్ దాడికి దిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

Follow Us