కొత్త మేయర్ అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లెక్సీల ఏర్పాటుపై జరిమానా విధింపు.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Feb 13, 2021 | 1:17 PM

గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాకిచ్చింది.

కొత్త మేయర్ అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లెక్సీల ఏర్పాటుపై జరిమానా విధింపు.. కారణాలు ఇలా ఉన్నాయి..
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాకిచ్చింది. ఈ నెల 11న గ్రేటర్ మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు విజయలక్ష్మి అనుచరుడు అతిష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించింది. అతిష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు.