Gas Cylinder Explosion: ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్లు పేలుడు కారణంగా భారీ నష్టం వాటిల్లుతోంది. అజాగ్రత్త, ఇతర కారణాల వల్ల గ్యాస్ లీకై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో పునాదిపాడులో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ లీకై ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 లక్షల రూపాయలు సహా బంగారం, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి