Ganja Smuggling: రూ.4 కోట్ల విలువైన గంజాయి సీజ్.. పబ్‌లు, డిస్కో థాక్స్‌కు సరఫరా..

Ganja Smuggling: గంజాయి స్మగ్లింగ్ కేసులో నలుగురిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు . నిందితుల నుంచి రూ.4 కోట్ల విలువైన 190 కిలోల గంజాయిని ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం

Ganja Smuggling: రూ.4 కోట్ల విలువైన గంజాయి సీజ్.. పబ్‌లు, డిస్కో థాక్స్‌కు సరఫరా..
Ganja Smuggling
Follow us

|

Updated on: Jul 28, 2022 | 8:42 PM

ముంబైలో గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను ఎన్‌సీబీ ఛేదించింది . గంజాయి స్మగ్లింగ్ కేసులో నలుగురిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు . నిందితుల నుంచి రూ.4 కోట్ల విలువైన 190 కిలోల గంజాయిని ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నలుగురు నిందితులు ముంబై వాసులు. గత ఐదేళ్లుగా ముంబైలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు. నిందితులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. నిందితులు గంజాయిని ఎవరికి అందజేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ 190 కిలోల డ్రగ్స్‌ని ముంబై, సమీపంలోని పబ్‌లు, డిస్కో థాక్స్, డ్రగ్ బేస్‌లకు సరఫరా చేస్తున్నారు.

రహస్య సమాచారం ఆధారంగా అరెస్టు

ఒడిశా నుంచి పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అందిన సమాచారం మేరకు పోలీసులు నిఘా వర్గాలను సంప్రదించారు. నిందితుడు థానేలోని భివాండిలోని పదఘా వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు టోల్ ప్లాజా వద్ద ఉచ్చు బిగించారు. ఈసారి అనుమానాస్పదంగా వస్తున్న వాహనాలను గమనించిన పోలీసులు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అనంతరం వారి వాహనాలను తనిఖీ చేయగా వాహనంలో 190 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితులు గత ఐదేళ్లుగా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు.

గంజాయి సాగుకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి గంజాయిని ముంబైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే వీరు ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి గంజాయిని తీసుకెళ్లి ముంబైలో ఎవరికైనా విక్రయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి గురించి కూడా ఆరా తీస్తున్నారు.

డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు?

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల నుంచి ఈ డ్రగ్‌ని ఈ ముఠా దిగుమతి చేసుకున్నట్లు ఎన్‌సీబీ విచారణలో తేలింది. ఈ ముఠా ముంబై, చుట్టుపక్కల చాలా మంది స్థానిక పెడ్లర్లకు డెలివరీ కోసం డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఈ వ్యవహారంపై ఎన్‌సీబీ మరింత దర్యాప్తు చేస్తోంది. ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఏ డ్రగ్స్‌ వ్యాపారులు వీరితో సంబంధాలు కలిగి ఉన్నారు, ఎక్కడెక్కడ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారో ఆరా తీస్తున్నారు.

 క్రైమ్ న్యూస్ కోసం..