Hyderabad: రాజేంద్ర నగర్‌లో గ్యాంగ్‌వార్.. మద్యం మత్తులో కొట్టుకున్న యువకులు..

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్‌ వార్ జరిగింది. మద్యం మత్తులో రెండు గ్యాంగుల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Hyderabad: రాజేంద్ర నగర్‌లో గ్యాంగ్‌వార్.. మద్యం మత్తులో కొట్టుకున్న యువకులు..
Gangwar

Updated on: Feb 07, 2022 | 6:40 AM

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్‌ వార్ జరిగింది. మద్యం మత్తులో రెండు గ్యాంగుల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ దగ్గరలోని చౌడమ్మ గుడి వద్ద ఆసిఫ్ నగర్‌కి చెందిన యువకులు, రాజేంద్రనగర్‌కి చెందిన యువకులు దావత్ నిర్వహించుకున్నారు. అయితే రాజేంద్రనగర్ కు చెందిన యువకులు మద్యం మత్తులో ఆసిఫ్ నగర్‌కి చెందిన యువకులపై దాడి చేశారు.

వెంటనే ఆసిఫ్ నగర్‌కి చెందిన ఓ యువకుడు వారి గ్యాంగ్‌కి సమాచారం అందించాడు. దీంతో రెండు గ్యాంగుల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవ పడుతున్న ఇరు వర్గాల యువకులను చెదరగొట్టారు. తీవ్ర గాయాలైన యువకులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గొడవకి గల కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు..

Crime News: వనపర్తి జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలతో కాలువలో దూకిన తల్లి..

Liquor Bottles: అక్కడి శ్మశానంలో కుప్పలు తెప్పలుగా మద్యం బాటిల్స్‌.. ఎక్కడి నుంచి వచ్చాయంటే..?

చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?