తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూర్‌లోని ఆనకట్ట రహదారిలో వచ్చిన ఓ కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారు అతివేగంగా నడపడటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. కాగా ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు పోలీసులు.
Read More:
మరో ప్రముఖ నటి సూసైడ్, కలకలం రేపుతోన్న ఆత్మహత్యలు!
అరకులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి
కొత్తగా 13 మంది సబ్ కలెక్టర్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం
మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్ట్, వ్యక్తి అరెస్ట్