హైదరాబాద్(Hyderabad) సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం(Batasingaram) లోని స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్ష ప్రశ్నపత్రాలు(Question Papers Leak) లీకయిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గిడ్డ కృష్ణమూర్తి, సముద్రాల వెంకటేశ్వర్లు, కేశెట్టి కృష్ణమోహన్, మండా వెంకట రామరెడ్డిలను అరెస్టు చేసి, వారి నుంచి 4 సెల్‌పోన్లు, డీవీఆర్, రిజిస్టర్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాంటూ స్టేట్ డిప్లొమా బోర్డుకు నివేదిక అందజేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నెల 8 నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవ్వగా..12న ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. వివిధ కళాశాలల విద్యార్థులకు చేరాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణమూర్తి స్వాతి కళాశాలలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్నారు.
ప్రశ్నా పత్రాలు లీక్ అయిన తీరు..
పరీక్షకు 40 నిమిషాల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రతి పరీక్షకు అర్ధగంట ముందు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి అధికారులు పేపర్ కోడ్‌ను పంపిస్తారు. దాని ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు పరీక్షా సమయానికి అందజేస్తారు. స్వాతి పాలిటెక్నిక్ కళాశాల నిర్వాహకులు మాత్రం అర్ధగంట ముందే వాట్సాప్‌లో పేపర్ లీక్ చేశారు. 8 వ తేదీన విద్యార్థులు పరీక్ష రాశారు. 9 వ తేదీన జరిగిన పరీక్షా పేపర్‌ను అర్ధగంట ముందే వాట్సాప్‌లో పంపించారు. దీంతో స్వాతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ స్నేహితులకు వాట్సాప్‌లలో ప్రశ్నాపత్రాన్ని పంపించారు.
అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు..
మెదక్ జిల్లా చేగుంటలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు 8వ తేదీన జరిగిన పరీక్షకు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు. 9 వ తేదీన కూడా పరీక్ష హాల్లో ఎవరూ కనిపించకపోవడం వల్ల అనుమానం వచ్చిన పరిశీలకుడు పరీక్షా కేంద్రం బయట చెట్ల కింద విద్యార్థులు కూర్చొని ఉండటాన్ని గమనించాడు. అక్కడి వెళ్లి వారి చరవాణులను పరిశీలించగా ప్రశ్నాపత్రం కనిపించింది. పరిశీలకుడు వెంటనే ఈ విషయాన్ని సాంకేతిక విద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ప్రశ్నాపత్రంలోని కోడ్‌ను పరిశీలించగా స్వాతి పాలిటెక్నిక్ కళాశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. వెంటనే అధికారులు అబ్ధుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు.
Also Read
viral News: వెరైటీ చోరీ.. ఏం దొంగిలించాడో తెలిస్తే షాక్ అవుతారు
AP Crime News: కీచకోపాధ్యాయుల సస్పెండ్.. క్రిమినల్ కేసు నమోదుకు విద్యాశాఖ మంత్రి సురేష్ ఆదేశం
CM KCR Birthday: ఏపీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు.. కడియం రైతుల వినూత్న శుభాకాంక్షలు..