Family Suicide: నంధ్యాలలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరు కూతుళ్లతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు కూతుళ్లతో సహా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.

Family Suicide: నంధ్యాలలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరు కూతుళ్లతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య
Nandyala Family Suicide

Updated on: Apr 28, 2021 | 10:04 AM

Four Family Members Suicide:  కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు కూతుళ్లతో సహా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. నంద్యాలలోని మాల్దార్ పేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా,అత్మహత్య చేసుకున్న వారిలో తండ్రి మంచా శేఖర్(35), తల్లి కళావతి(30), కూతుళ్లు అంజని(15), అఖిల (13) ఉన్నారు. వీరంతా ఒకేసారి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌లో భారీ డబ్బులు పెట్టి నష్టపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం.. మూడుసార్లు ప్రకంపనలు.. వణికిపోయిన ఈశాన్య ప్రజలు